పూర్ణ వందేమాతరం..దేశభక్తితో గాయక శ్రీకారం

దీనిని మొట్టమొదటి సారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1896లో ఆలపించారు. 1950లో భారత్ గణతంత్రమైన తరువాత భారత ప్రభుత్వం మొదటి రెండు చరణాలతో ఈ పాటను జాతీయ ఆలాపనగా గుర్తించింది. ఈ గీతం బంకించంద్ర గారి ఆనందమఠ్ అనే నవలలోది. 1876వ సంవత్సరంలో ఆయన ఆనందమఠాన్ని రచించగా 1882వ సంవత్సరంలో అది ప్రచురితమైంది. సంస్కృతం, బెంగాలీ శబ్దాలు కలిగిన ఈ జాతీయ గీతాన్ని స్వరపరచిన వారు జాదూనాథ్ బెనర్జీ. తొలుత దీనిని జాతీయ గీతంగా గుర్తించాలని ప్రతిపాదన వచ్చినా ముస్లింల వ్యతిరేకతతో జనగణమన జాతీయ గీతం అయ్యింది. వందేమాతరం జాతీయ గీతంగా కావటాన్ని వ్యతిరేకించిన వారిలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒకరు. వందేమాతరంలో భరతమాతను దుర్గాదేవిగా ఆవిష్కరించటం ఆనాటి బెంగాలు మరియు ఇతర ప్రాంతాల ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకించారు. తదుపరి బాబూ రాజేంద్రప్రసాద్ గారు రాజ్యాంగ అసెంబ్లీలో తీర్మానంతో జాతీయ ఆలాపన అయిన వందేమాతరాన్ని జాతీయ గీతమైన జనగణమనతో సమానమైనదిగా గుర్తింపజేశారు.